చైతూ సినిమా వాయిదా!

Naga Chaitanya Shailaja Reddy Alludu Postponed - Sakshi

కేరళలో కురుస్తున్న వర్షాలు టాలీవుడ్‌ ఇండస్ట్రీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. తెలుగులో మలయాళ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అయితే కేరళలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వారు షూటింగ్‌లలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో పాల్గొన లేకపోవటంతో సినిమాలు ఆలస్యమవుతున్నాయి.

యంగ్ నాగచైతన్య నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాకు కూడా కేరళ వరదల షాక్‌ తగిలింది. ఆగస్టు 31న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేస్తున్న చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నారు. అక్కడి పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి కాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. హీరో నాగచైతన్య ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెళ్లడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top