చైతూ సినిమాలో సెంటిమెంటే హైలెట్‌ | Naga Chaitanya Savyasachi Movie Update | Sakshi
Sakshi News home page

Mar 20 2018 11:24 AM | Updated on Mar 20 2018 11:24 AM

Naga Chaitanya Savyasachi Movie Update - Sakshi

‘సవ్యసాచి’ ఫస్ట్‌ లుక్‌

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూకి ప్రేమమ్ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సీనియర్ హీరోయిన్‌ భూమిక, హీరో మాధవన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మాధవన్‌ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. భూమిక, నాగచైతన్యకు అక్కగా నటిస్తోంది. సినిమాకు వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే హైలెట్‌ గా నిలుస్తాయన్న టాక్ వినిపిస్తోంది. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సినిమా తెరకెక్కుతోందన‍్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement