-
‘టాలీవుడ్‌కు స్వాగతం’
కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఆకట్టుకున్న మాధవన్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా సవ్యసాచి. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే అయినా ఇంత వరకు మాధవన్ స్ట్రయిట్ తెలుగు సినిమా మాత్రం చేయలేదు. నాగచైతన్య హీరోగా చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఈ మ్యాన్లీ హీరో. ఇప్పటికే సవ్యసాచి సినిమాలో మాధవన్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీ కరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మ్యాడీకి ఓ లేఖ రాశారు. ‘17 ఏళ్ల క్రితం మీతో ప్రేమలో పడ్డాం. వీడియో జాకీగా ప్రారంభమై నటుడిగా ఎదిగిన మీ ప్రస్థానం మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తి. కేవలం మీ నటనకే కాదు మీ మాటలకు కూడా మేం అభిమానులం. దర్శకుడిగా విజన్‌ను గౌరవించే ఓ గొప్ప నటుడితో కలిసి పనిచేయటం ఆనందంగా ఉంది. మిమ్మల్ని తెలుగు తెరకు పరిచయం చేయడానికి చాలా సమయం పట్టింది. మీ అంగీకారంతో టాలీవుడ్‌కు మిమ్మల్ని పరిచయం చేయటమే కాదు, మా సినిమా కూడా సగం విజయం సాధించింది. సవ్యసాచి యూనిట్ తరుపున టాలీవుడ్‌కు స్వాగతం’ అంటూ ఓ లేఖ రాశారు. సవ్యసాచి సినిమా నటించటంపై మాధవన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. -
చైతూ సినిమాలో సెంటిమెంటే హైలెట్
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూకి ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సీనియర్ హీరోయిన్ భూమిక, హీరో మాధవన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మాధవన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. భూమిక, నాగచైతన్యకు అక్కగా నటిస్తోంది. సినిమాకు వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే హైలెట్ గా నిలుస్తాయన్న టాక్ వినిపిస్తోంది. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సినిమా తెరకెక్కుతోందన్న ప్రచారం జరుగుతోంది. -
‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్
‘ప్రేమమ్’ లాంటి సూపర్ సక్సెస్ తరువాత అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్ లను ఎనౌన్స్ చేసారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ లు మాట్లాడుతూ.. ‘మా యూనిట్ సభ్యులందరికీ సవ్యసాచి ఒక స్పెషల్ ఫిలిం. ప్రస్తుతం హైద్రాబాద్ లో హీరో నాగచైతన్య, భూమికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం అమెరికా వెళ్లనున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 18న విడుదల చేయాలనుకొంటున్నాం. అలాగే సవ్యసాచి చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కీరవాణి గారు సవ్యసాచికి సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. -
నాగ్ సినిమాలో నిఖిల్, అనుపమా
ఓం నమో వేంకటేశాయ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న నాగ్, తిరిగి షూటింగ్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజుగారి గది 2 షూటింగ్లో పాల్గొంటున్న నాగ్, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. నాగచైతన్య హీరోగా ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించిన చందూ మొండేటి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. నాగార్జునతో పాటు నిఖిల్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటి అనుపమా పరమేశ్వరన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. అనుపమ, నిఖిల్‌కు జోడిగా నటిస్తుండగా, నాగార్జునకు హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. రాజుగారి గది 2 షూటింగ్ పూర్తి కాగానే చందూ మొండేటి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నాడు నాగార్జున. -
యంగ్ హీరోతో నాగ్ మల్టీ స్టారర్
సీనియర్ హీరోల్లో ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే స్టార్ కింగ్ నాగార్జున. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ నుంచి భక్తిరస చిత్రాల వరకు.. ఇప్పటికీ అన్ని రకాల పాత్రల్లో అలరిస్తున్న నాగార్జున, యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో కొన్ని సినిమాలో గెస్ట్ అపియరెన్స్‌లు ఇచ్చిన ఈ మన్మథుడు.. ఇప్పుడు ఓ సక్సెస్ ఫుల్ యంగ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నయంగ్ హీరో నిఖిల్. స్వామిరారా, కార్తీకేయ, ఎక్కడికీపోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో డిఫరెంట్ జానర్లో దూసుకుపోతున్న ఈ యువ కథానాయకుడు సీనియర్ స్టార్ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట. నిఖిల్ హీరోగా కార్తీకేయ సినిమాను తెరకెక్కించిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్‌పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్‌కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement