'కార్తికేయ' సీక్వెల్ చేస్తున్నారు | nikhil, Chandhu mondeti karthikeya sequal | Sakshi
Sakshi News home page

'కార్తికేయ' సీక్వెల్ చేస్తున్నారు

Dec 2 2015 10:49 AM | Updated on Sep 3 2017 1:23 PM

'కార్తికేయ' సీక్వెల్ చేస్తున్నారు

'కార్తికేయ' సీక్వెల్ చేస్తున్నారు

గత ఏడాది నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ. సుబ్రమణ్యం స్వామి గుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమా అప్పట్లో విజయం...

గత ఏడాది నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ. సుబ్రమణ్యం స్వామి గుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. స్వామిరారా సక్సెస్తో మంచి జోష్లో ఉన్న నిఖిల్కు 'కార్తికేయ' సక్సెస్ స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. అందుకే కార్తికేయ రిలీజ్ తరువాత ఆ సినిమాకు సీక్వెల్ను రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు చిత్రయూనిట్.

ప్రస్తుతం శంకరాభరణం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నిఖిల్ త్వరలోనే కార్తికేయ సీక్వెల్ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. దర్శకుడు చందూ మొండేటి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. అయితే ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ప్రేమమ్ సినిమాను మజ్ను పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న చందూ, ఆ సినిమా పూర్తయిన తరువాత నిఖిల్ హీరోగా కార్తికేయ సీక్వెల్ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

తొలి భాగాన్ని ఒక గుడి నేపథ్యంలోనే తెరకెక్కించిన చందూ రెండో భాగాన్ని అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే భారీ నిర్మాతలు ఈ కాంబినేషన్ లో సినిమాను నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement