చైతూ.. సమంతల ‘మజిలి’ | Naga Chaitanya Samantha Film To Be Titled Majili | Sakshi
Sakshi News home page

Aug 16 2018 10:08 AM | Updated on Aug 16 2018 10:29 AM

Naga Chaitanya Samantha Film To Be Titled Majili - Sakshi

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, తన రీల్, రియల్‌ లైఫ్‌ జోడి సమంతతో కలిసి మరో సినిమలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతు సామ్‌లు కలిసి నటిస్తున్నారు. ఏమాయ చేసావే సినిమాతో తొలిసారిగా మాయ చేసిన ఈ జంట తరువాత టాలీవుడ్‌లో సూపర్‌ హిట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు.

పెళ్లి తరువాత చైతూ సమంతలు కలిసి నటిస్తున్న తొలి సినిమా కావటంతో శివ నిర్వాణ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు  ‘మజిలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement