నాగచైతన్య హీరో...రానా నిర్మాత! | Naga Chaitanya & Rana turning producers | Sakshi
Sakshi News home page

నాగచైతన్య హీరో...రానా నిర్మాత!

Dec 14 2016 11:54 PM | Updated on Aug 11 2019 12:52 PM

నాగచైతన్య హీరో...రానా నిర్మాత! - Sakshi

నాగచైతన్య హీరో...రానా నిర్మాత!

ఓన్లీ హీరోగానేనా? ఇంకా ఏమైనా చేయాలని ఉందా?’ అని నాగచైతన్యను ఓ ఇంటర్వ్యూలో ‘సాక్షి’ అడిగితే.. ‘నాకు ప్రొడక్షన్‌ అంటే ఇంట్రస్ట్‌ అండి.

‘ఓన్లీ హీరోగానేనా? ఇంకా ఏమైనా చేయాలని ఉందా?’ అని నాగచైతన్యను ఓ ఇంటర్వ్యూలో ‘సాక్షి’ అడిగితే.. ‘నాకు ప్రొడక్షన్‌ అంటే ఇంట్రస్ట్‌ అండి. అందుకని భవిష్యత్తులో నిర్మాతగా మారతా’ అన్నారు. ఇప్పుడా సమయం దగ్గర పడినట్లే అనిపిస్తోంది. బావ (చైతూకి రానా మేనమామ కొడుకు అవుతాడనే విషయం తెలిసిందే) రానాతో కలసి ఆ ప్రయత్నం మీదే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంతకన్నా ముందే రానా నిర్మాతగా నాచైగతన్య హీరోగా ఓ సినిమా రూపొందనుంది.

మాతృసంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో ఇప్పటివరకూ చైతూ సినిమా చేయలేదు. ఇప్పుడో సినిమా కుదిరిందట. అయితే ఆ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరించాలనుకుంటు న్నారు. ఆ తర్వాత తామిద్దరూ కలసి నిర్మించే చిత్రాల గురించి రానా – చైతూ పకడ్బందీగా ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతారట. అన్నట్లు రానాకు నిర్మాతగా ఇది మొదటి సినిమా కాదు. గతంలో కోవెలమూడి ప్రకాశ్‌ దర్శకత్వంలో బాలల చిత్రం ‘బొమ్మలాట’ నిర్మించారు. హిందీ హీరో అక్షయ్‌ కుమార్‌తో కలసి ఇప్పుడు కొన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement