‘వి’ డైరెక్టర్‌తో చైతూ చిత్రం? | Naga Chaitanya Next Telugu Movie With V Director Indraganti | Sakshi
Sakshi News home page

ఇంద్రగంటితో చైతూ చిత్రం

Apr 17 2020 2:03 PM | Updated on Apr 17 2020 3:44 PM

Naga Chaitanya Next Telugu Movie With V Director Indraganti - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబు హీరోలుగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘వి’చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత డైరెక్టర్‌ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా గురించి అప్‌డేట్‌ వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విభిన్న చిత్రాల డైరెక్టర్‌ తన తదుపరి చిత్రం అక్కినేని నాగ చైతన్యతో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. 

వాస్తవానికి నాగచైతన్యతో సినిమా తీయాలని మోహన్‌కృష్ణ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్‌ టాక్‌. అయితే ఈమధ్య చైతూకు కథ చెప్పగానే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వకంలో తెరకెక్కుతున్న ‘లవ్‌ స్టోరీ’ చిత్రంతో నాగచైతన్య బిజీగా ఉన్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అన్నీ కుదరితే ‘లవ్‌ స్టోరీ’ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కె అవకాశం ఉంది. ఇక తన ప్రతీ సినిమాలో హీరోయిజాన్ని కొత్తగా చూపించే ఈ డైరెక్టర్‌ చైతూను ఎలా చూపిస్తాడో వేచి చూడాల్సిందే. 

చదవండి:
‘మా కోసం గడపదాటి వచ్చావయ్యా!’
క్రికెటర్‌ టు స్టూడెంట్‌!

Advertisement
 
Advertisement
Advertisement