క్రికెటర్‌ టు స్టూడెంట్‌! | Harbhajan Singh to Make Acting Debut with Film friendship yours friendly | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ టు స్టూడెంట్‌!

Apr 17 2020 1:51 AM | Updated on Apr 17 2020 1:51 AM

Harbhajan Singh to Make Acting Debut with Film friendship yours friendly - Sakshi

హర్భజన్‌ సింగ్‌

క్రికెటర్‌ నుంచి యాక్టర్‌గా మారి ‘ఫ్రెండ్‌షిప్‌ యువర్స్‌ ఫ్రెండ్లీ’ అనే చిత్రంలో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు హర్భజన్‌ సింగ్‌. ఇందులో లోస్లియా మరియాసేన్‌ కథానాయికగా నటిస్తున్నారు. జాన్‌పాల్‌ రాజ్, శ్యామ్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు అర్జున్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమాలో మెకానికల్‌ స్టూడెంట్‌గా హర్భజన్‌ సింగ్‌ నటిస్తున్నట్లు తెలిసింది.

‘‘స్కూలింగ్‌ తర్వాత కొంత గ్యాప్‌ వచ్చి, మళ్లీ చదువును కొనసాగించే వ్యక్తి పాత్రలో కనిపిస్తారు హర్భజన్‌ సింగ్‌. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవడం కోసం పంజాబ్‌ నుంచి కోయంబత్తూర్‌ వచ్చి ఓ కాలేజ్‌లో జాయిన్‌ అవుతారు హర్భజన్‌. కోయంబత్తూర్‌కే హర్భజన్‌ ఎందుకు వచ్చాడు? అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే కథాంశం. ఈ చిత్రంలో అర్జున్‌ క్యారెక్టర్‌ ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. లాక్‌డౌన్‌కి ముందే తొలి షెడ్యూల్‌ పూర్తయింది. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement