
ఇండియా నా ఇల్లు!
మీ ఊరు పేరేంటి? అని ఎవరినైనా అడిగితే... హైదరాబాద్ అనో, ముంబయ్ అనో, ఢిల్లీ అనో ఏదొక ఊరు పేరు చెబుతారు.
మీ ఊరు పేరేంటి? అని ఎవరినైనా అడిగితే... హైదరాబాద్ అనో, ముంబయ్ అనో, ఢిల్లీ అనో ఏదొక ఊరు పేరు చెబుతారు. అలాగే, ఇల్లు గురించి అడిగితే ఇల్లెక్కడుందో చెబుతారు.. ఎవరైనా దేశం పేరు చెబుతారా? అల్లు అర్జున్ మాత్రం చెబుతారు. ‘ఇండియా నా ఇల్లు’ అంటున్నారాయన. అసలు మేటర్ ఏంటంటే... రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వంశీ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. టైటిల్‌ను బట్టి దేశభక్తి కథతో అల్లు అర్జున్, వక్కంతం వంశీలు సినిమా చేయనున్నారని ఊహించవచ్చు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’లో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. శివరాత్రి సందర్భంగా టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.