సమంతకు దేవుడిచ్చిన బిడ్డ.. | 'My God Son.. Ansh' tweets Samantha | Sakshi
Sakshi News home page

సమంతకు దేవుడిచ్చిన బిడ్డ..

Mar 22 2016 7:56 AM | Updated on Sep 3 2017 8:16 PM

'దేవుడిచ్చిన బిడ్డ.. అన్ష్' అంటూ సమంతా ముద్దులొలికే చిన్నారితో ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

'దేవుడిచ్చిన బిడ్డ.. అన్ష్' అంటూ సమంతా ముద్దులొలికే చిన్నారితో ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మొన్నే కదా మహేష్ బాబు గారాల కూతురు సితార అడిగిందని.. మూడు రోజుల్లో నాకో బేబీ కావాలి, ఎలా అంటూ హైరానా పడింది, నిజంగానే బేబీ దొరికేసిందా అని ఆలోచనలో పడకండి. ఈ బుజ్జాయి సమంత స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన ముద్దుల కొడుకు. చిన్నారి నిద్రపోతుండగా పక్కన చేరిన సమంత మురిసిపోతూ ఓ ఫొటో దిగింది.   

ఆకట్టుకునే అందంతోపాటు ప్రేమించే మనసు కూడా సమంత సొంతం. తన చుట్టూ ఉన్నవారితో ఎంతో ఆప్యాయంగా వ్యవహరిస్తుందనేది ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిన విషయం. ఏదేమైనా ఆ ఫొటోలో చిన్నారితోపాటు మన సమంత కూడా భలే స్వచ్ఛంగా కనిపిస్తుంది కదా. సమంత ప్రేమకు స్పందిస్తూ బాబు తల్లి నీరజ.. 'నా ఇద్దరు బంగారు పాపలు' అంటూ ట్వీట్ చేసింది.





 

Advertisement
 
Advertisement
Advertisement