సంగీత దర్శకుడికి గాయాలు, ఆస్పత్రిపాలు | Musician Shravan hospitalized after a road accident | Sakshi
Sakshi News home page

సంగీత దర్శకుడికి గాయాలు, ఆస్పత్రిపాలు

Jan 6 2016 10:09 AM | Updated on Aug 30 2018 3:58 PM

సంగీత దర్శకుడికి గాయాలు, ఆస్పత్రిపాలు - Sakshi

సంగీత దర్శకుడికి గాయాలు, ఆస్పత్రిపాలు

బాలీవుడ్లో అద్భుత చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించిన సంగీత ద్వయం నదీమ్ శ్రవణ్ల జోడిలోని శ్రవణ్ ప్రమాదానికి గురయ్యారు. ఢిల్లీ జైపూర్ హైవే పై ప్రయాణిస్తుండగా ఆయన వాహనం ప్రమాదానికి గురైంది...

బాలీవుడ్లో అద్భుత చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించిన సంగీత ద్వయం నదీమ్ - శ్రవణ్ల జోడీలోని శ్రవణ్ ప్రమాదానికి గురయ్యారు. ఢిల్లీ జైపూర్ హైవే పై ప్రయాణిస్తుండగా ఆయన వాహనం ప్రమాదానికి గురైంది.

ప్రస్తుతం శ్రవణ్, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1979లో రిలీజ్ అయిన దంగల్ సినిమాతో సంగీత ప్రయాణం మొదలు పెట్టిన నదీమ్ శ్రవణ్లు 2005 వరకు కలిసి పనిచేశారు. ఆ తరువాత ఇద్దరు విడి విడిగా సంగీత దర్శకత్వం చేస్తున్నప్పటికీ భారీ విజయాలను మాత్రం నమోదు చేయలేకపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement