సూపర్ స్టార్కు స్టార్ డైరెక్టర్ కితాబు | Murugadoss comments on Mahesh Babu | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్కు స్టార్ డైరెక్టర్ కితాబు

Aug 26 2016 3:19 PM | Updated on Jul 23 2019 11:50 AM

సూపర్ స్టార్కు స్టార్ డైరెక్టర్ కితాబు - Sakshi

సూపర్ స్టార్కు స్టార్ డైరెక్టర్ కితాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన ప్రిన్స్, ఈ సారి అభిమానులను భారీ హిట్తో అలరించాలని...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన ప్రిన్స్, ఈ సారి అభిమానులను భారీ హిట్తో అలరించాలని భావిస్తున్నాడు. అందుకే మురుగదాస్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, షూటింగ్ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ మహేష్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అందగాడిగా, నటుడిగా సూపర్ స్టార్కు తిరుగులేదన్నది అందరికీ తెలిసిన విషయమే, అయితే అలాంటి సూపర్ స్టార్ సెట్లో ఎలా ఉంటాడు అన్న విషయాన్ని బయటపెట్టాడు, డైరెక్టర్ మురుగదాస్. మహేష్ చాలా స్టైలిష్, మ్యాన్లీ అంటూ పొగిడేసిన మురుగదాస్, సెట్లో ప్రిన్స్ దర్శకుడు చెప్పే విషయాలను ఆసక్తిగా వింటారని, ఎంతో డేడికేషన్తో వర్క్ చేస్తారని తెలిపాడు. ఈ మధ్యే రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలైన ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement