చైనీస్‌కు దృశ్యం | Mohanlal is Drishyam to be remade in Chinese | Sakshi
Sakshi News home page

చైనీస్‌కు దృశ్యం

Nov 4 2019 3:34 AM | Updated on Nov 4 2019 3:34 AM

Mohanlal is Drishyam to be remade in Chinese - Sakshi

‘షీఫ్‌ వితౌట్‌..’లో ఓ దృశ్యం

ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు మరో భాషలో రీమేక్‌ కావడం సాధారణం. ఈ మధ్య కాలంలో మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం’ ఎక్కువ భాషల్లో  రీమేక్‌ అయింది. తాజాగా చైనీస్‌ భాషకి వెళ్లడం విశేషం. మోహన్‌లాల్‌ హీరోగా జీతూ జోసెఫ్‌ రూపొందించిన థ్రిల్లర్‌ ‘దృశ్యం’. తెలుగులో వెంకటేశ్‌ (దృశ్యం), తమిళంలో కమల్‌ హాసన్‌ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్‌ (దృశ్య), హిందీలో అజయ్‌ దేవగన్‌ (దృశ్యం) హీరోలుగా రీమేక్‌ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్‌ అయింది. ఇప్పుడు చైనీస్‌లో ‘షీప్‌ వితౌట్‌ ఏ షెపర్డ్‌’ ౖటñ టిల్‌తో రీమేక్‌ అయింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 20న విడుదలవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement