ఆ రోజు ఎవరూ నా దగ్గరకి రావొద్దు :మోహన్‌బాబు

Mohan Babu Postponed His Birthday Celebrations Due To Coronavirus - Sakshi

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా ‘ కరోనా’ మరణాల సంఖ్య  ఏడు వేలకు దాటింది. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో  కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. కరోనాపై సినీ హీరోలు సైతం అవగాహన కల్పిస్తున్నారు. (కరోనా అలర్ట్‌ : మహేష్‌బాబు సూచనలు)

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఇప్పటికే సినిమా హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, మహేశ్‌ బాబు సందేశాన్ని అందించారు. తాజాగా ఈ మహమ్మారి వైరస్పై డైలాగ్‌ కింగ్‌ మోహన్ బాబు కూడా స్పందించాడు. ఈ ఏడాది మార్చి 19న తన పుట్టినరోజున శ్రీవిద్యానికేతన్‌లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు  విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఆత్మీయ విన్నపంతో పేరుతో లేఖను విడుదల చేశారు. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఈ సందర్భంగా శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. (కరోనాపై రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వీడియో)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top