శ్రావణంలో గాయత్రి ఆరంభం | mohan babu new movie started | Sakshi
Sakshi News home page

శ్రావణంలో గాయత్రి ఆరంభం

Jul 29 2017 12:38 AM | Updated on Sep 27 2018 8:48 PM

శ్రావణంలో గాయత్రి ఆరంభం - Sakshi

శ్రావణంలో గాయత్రి ఆరంభం

మహిళలంటే మంచు మోహన్‌బాబుకు ఎంతో మర్యాద.

మహిళలంటే మంచు మోహన్‌బాబుకు ఎంతో మర్యాద. ఆయన మాటల్లో, చేతల్లో మహిళలపై గౌరవం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి మహిళలపై ఆయనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా నటించనున్న సినిమాకు ‘గాయత్రి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్‌ మదన్‌ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మించనున్న ఈ సినిమా శ్రావణ శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా క్లాప్‌ ఇచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు మదన్‌కు అరియానా, వివియానా, మంచు లక్ష్మి, విరోనికా మంచు, నిర్మలా మంచు, పరుచూరి గోపాలకృష్ణ, ‘డైమండ్‌’ రత్నబాబు, సుద్దాల అశోక్‌తేజ్‌లు స్క్రిప్ట్‌ అందజేశారు. ఈ సినిమాకు సంబంధించిన
మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కళ: చిన్నా, కెమెరా: సర్వేష్‌ మురారి, సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement