
సంగీత దర్శకులు తాము సంగీతమందించిన చిత్రాల్లో పాటలు పాడినా.. ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లో పాటలు పాడటం చాలా అరుదు. ముఖ్యంగా సంగీత దర్శకులుగా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు ఇతర సంగీత దర్శకుల కోసం సమయమివ్వటం మరింత అరుదు. అలాంటి అరుదైన కలయిక త్వరలో సంగీత అభిమానులను అలరించనుంది.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది స్వర సంచలనం ఏఆర్ రెహమాన్ స్వర సారధ్యంలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి ఓ పాట పాడారు. తాను రెహమాన్ కోసం ఏ సినిమాలో పాట పాడిని విషయాన్ని తెలుపకపోయినా.. స్వదేశ్ సినిమాలో ఏ జో దేశ్ హై తేరా లాంటి అద్భుతమైన మెలోడీని పాడినట్టుగా తన ట్విట్టర్ లో వెల్లడించారు కీరవాణి. మరి రెహమాన్ బాణీలో కీరవాని ఆలపించిన ఆ పాట ఏదో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
YeJo Desh Hai Tera- is one of ARR’s best melodies. Just sang a wonderful song of d same eminence 4 his upcoming film.Enjoyed the session !
— mmkeeravaani (@mmkeeravaani) 22 October 2017