కోలీవుడ్‌కు ఆస్ట్రేలియా అందగత్తె

Miss Australia Entry In South Film Industry - Sakshi

తమిళసినిమా: ఇండియాలోని ఉత్తరాది, దక్షిణాది భాషలకు చెందిన నటీమణులే కాకుండా కెనడా లాంటి ఇతర దేశాలకు చెందిన వారు కూడా కోలీవుడ్‌పై కన్నేస్తున్నారు. అయితే ఆ ట్రెండ్‌ ఇటీవల తగ్గిందనుకుంటే కాదు ఇది నిరంతర ప్రక్రియే అన్నట్టుగా మరో దేశానికి చెందిన బ్యూటీ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. అవును ఆస్ట్రేలియాకు చెందిన అందాలసుందరి ఆషిమా నెర్వాస్‌ తమిళ చిత్రంలో కథానాయకిగా పరిచయం అవుతోంది. అస్ట్రేలియాలో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ అక్కడ జరిగిన మిస్‌ ఇండియా, మిస్‌ ఆస్ట్రేలియా అందాల పోటీల్లో కిరీటాలను గెలుచుకుంది. ఆ తరువాత మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకున్న ఆషియా నెర్వాస్‌ ఇప్పుడు కోలీవుడ్‌లో విజయ్‌ఆంథోనికి జంటగా కొలైక్కారన్‌ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభమైన ఈ చిత్రంలో నటుడు అర్జున్‌ విలన్‌గా నటిస్తున్నారు.

నటి ఆషిమా నెర్వాస్‌ కుటుంబం సహా చెన్నైకి వచ్చి కొలైక్కారన్‌చిత్ర షూటింగ్‌లో పాల్గొంటోందట. నవ దర్శకుడు ఆండ్రూ లూయిస్‌ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఆయన ఈ చిత్రంలో ఆస్ట్రేలియా బ్యూటీని హీరోయిన్‌గా ఎంపిక చేయడం గురించి చెబుతూ ఆమెలో తమిళ అమ్మాయి ఛాయలు కనిపించడంతో తమ చిత్రంలో నాయకి పాత్రకు బాగుంటుందని ఎంపిక చేశామని చెప్పారు. కొలైక్కారన్‌ చిత్రం విడుదలనంతరం ఆషియా నెర్వాస్‌ కోలీవుడ్‌లో ఒక రౌండ్‌ చుట్టేస్తుందని అన్నారు. ఈ బ్యూటీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ ఒక చిత్రం చేస్తోందట. చూడాలి మరి ఈ రెండు భాషల్లో ఎక్కడి అభిమానులను అలరించి పాగా వేస్తుందో!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top