పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ 'మిస్ మ్యాచ్'  | Mismatch Telugu Movie Success Meet At Hyderabad | Sakshi
Sakshi News home page

పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ 'మిస్ మ్యాచ్' 

Dec 7 2019 9:34 PM | Updated on Dec 7 2019 9:41 PM

Mismatch Telugu Movie Success Meet At Hyderabad - Sakshi

ఉదయ్‌శంకర్‌, ఐశ్వర్యా రాజేష్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ మ్యాచ్‌’. అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి బేనర్‌పై జి. శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌ నిర్మించిన ఈ చిత్రానికి  నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. కాగా, శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్‌తో దూసుకపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథా రచయిత భూపతి రాజా మాట్లాడుతూ.. ‘ఓ చిన్న సినిమాగా దీన్ని ప్రారంభించాం విడుదలైన తర్వాత పెద్ద చిత్రమైంది. రెండు కుటుంబాల జర్నీని తెలియజేస్తుంది. ఓ జంట స్వచ్ఛమైన ప్రేమ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపిందనేది ముఖ్య కథ. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉందిమంచి కథా బలం ఉన్న సినిమా. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి’ అన్నారు.

‘మా బేనర్ లో తొలి చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని వర్గాల ఆడియన్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. థియేటర్లో సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాజానికి అవసరమైన స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా. పూర్తిగా పాజిటివ్ కంటెంట్.  కుటుంబంతో కలిసి చూసి ఎంకరేజ్ చేయాలని  ప్రేక్షకులను కోరుకుంటున్నా’ అని నిర్మాత శ్రీరామ్‌రాజు పేర్కొన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..‘ఈ శుక్రవారం మూడు మ్యాచ్ లో గెలిచాం. ఒకటి 'దిశ నిందితుల ఎన్‌కౌంటర్, రెండు టీమ్  ఇండియా క్రికెట్ లో గెలవడం, మూడు మా సినిమా పెద్ద సక్సెస్ కావడం. సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్  నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా  తొలిప్రేమ లోని ‘ఈ మనసే’ పాటకి థియేటర్ లో అద్భుతమైన స్పందన కనిపించింది. మంచి మ్యూజిక్ అందించిన గిఫ్ట‌న్ గారికి థ్యాంక్స్’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు నిర్మల్‌ కుమార్‌, సంగీత దర్శకుడు గిఫ్టన్, నటులు శరణ్య, సంధ్య, వెంకట రామారావు, శ్రీ రామ్ బాలాజీ, కెమెరామెన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: 
‘మిస్‌ మ్యాచ్‌’ మూవీ రివ్యూ

Advertisement
 
Advertisement
Advertisement