పెళ్లి పీటలెక్కనున్న స్టార్‌ హీరోయిన్‌..?

Milky Beauty Tamannaah Getting Married Soon - Sakshi

టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా త‍్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సౌత్‌ సినిమా సర్కిల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ నటించిన తమన్నా కొద్దిరోజులుగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పుష్కార కాలానికి పైగానే పూర్తయ్యింది. ఇన్నేళ్లలో గ్లామరస్‌ బ్యూటీగా ఆకట్టుకున్న తమన్నాకు నటిగా ప్రూవ్‌ చేసుకునేందుకు మాత్రం అవకాశాలు దక్కలేదు.

కొంత కాలంగా సరైన అవకాశాలు లేకపోవటంతో పర్సనల్‌ లైఫ్ మీద దృష్టి పెట్టారు తమన్నా. ఇప్పటికే ఆమె కుటుంబం సభ్యులు వరుడ్నికూడా ఫైనల్ చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌తో త్వరలోనే తమన్నా వివాహం జరుగునుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై తమన్నా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ క్వీన్‌ రీమేక్‌తో పాటు వెంకటేష్‌, వరుణ్ తేజ్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎఫ్ 2 సినిమాల్లో నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top