అది సంతృప్తి నివ్వలేదు | Milk Beauty Celebrating Her Birthday | Sakshi
Sakshi News home page

అది సంతృప్తి నివ్వలేదు

Dec 22 2014 2:19 AM | Updated on Sep 2 2017 6:32 PM

అది సంతృప్తి నివ్వలేదు

అది సంతృప్తి నివ్వలేదు

మూడు పదుల వయసు కోసం ఎదురు చూస్తున్నారట తమన్న. నటిగా తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ ప్రముఖ హీరోయిన్లలో ఒకరిగా ప్రకాశిస్తున్న ఈ పంజాబీ భామ తన స్థాయి ఇంకా సంతృప్తి నివ్వలేదట.

మూడు పదుల వయసు కోసం ఎదురు చూస్తున్నారట తమన్న. నటిగా తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ ప్రముఖ హీరోయిన్లలో ఒకరిగా ప్రకాశిస్తున్న ఈ పంజాబీ భామ తన స్థాయి ఇంకా సంతృప్తి నివ్వలేదట. కోలీవుడ్ కరీనాకపూర్‌గా ప్రాచుర్యం పొందిన తమన్న పాలరాతి బొమ్మలాంటి శరీరాకృతితో కుర్రకారుకు కనువిందు కలిగిస్తోంది. 1989 డిసెంబర్ 21న ముంబయిలో పుట్టిన ఈ మిల్కీ బ్యూటీ తన 15వ ఏటనే నటిగా బాలీవుడ్‌లో ప్రవేశించారు. చాంద్ సే రోసన్ సేకర్ అనేది హీరోయిన్‌గా తమన్న తొలి చిత్రం. ఆ తరువాత దక్షిణాదిపై కన్నేశారు. ఇక్కడ తొలిచిత్రం కేడీ.

ఏఎం రత్నం తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో మరో కొడుకు రవికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా పరిచయం కాగా, ప్రతినాయిక పాత్రలో తమన్న నటించారు. అయితే నటిగా మంచి గుర్తింపు నిచ్చిన చిత్రం కల్లూరి. తెలుగులో హ్యాపీడేస్ చిత్రం ఈ భామ కెరీర్‌కు తొలి హ్యాపీ చిత్రంగా నిలిచింది. ఆ తరువాత తమిళంలో పడిక్కాదవన్, అయన్ తదితర చిత్రాల విజయాలు తమన్నను ఉన్నతస్థానంలో కూర్చోపెట్టాయి.  ప్రస్తుతం హిందీ చిత్రాలపై అధిక దృష్టి సారించిన తమన్న అక్కడ అక్షయ్‌కుమార్, అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్‌లతో జోడి కడుతున్నారు. అలాగే ప్రస్తుతం తమిళంలో ఆర్యతో రొమాన్స్ చేస్తున్నారు.
 
నేనొచ్చిన పని పూర్తి కాలేదు   

తాను ఈ రంగంలోకి వచ్చిన పని పూర్తిగా కాలేదంటోంది తమన్న. ఇప్పటికే పాతికేళ్ల వయసును పూర్తి చేసుకున్నారు. తన ఈడు వారంతా పెళ్లి చేసుకున్నారట. కానీ తాను మాత్రం ఎంతో సాధించాలని వచ్చిందట. అయితే తాను వచ్చిన పని ఇంకా పూర్తిగా నెరవేరలేదంది. అందువల్లే వైవిధ్యభరిత పాత్రల వైపు దృష్టి సారించినట్లు తెలిపింది. నయనతార, అనుష్కల వంటి వారికి 30 ఏళ్ల తరువాతే వెయిటైన పాత్రలు లభించాయి. అలాగే నేను 30 ఏళ్ల వరకు అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తాను. అందుకే ప్రస్తుతానికి వివాహం గురించి ఆలోచించడం లేదని తన మనసులోని భావాలను బయటపెట్టారట.

Advertisement
 
Advertisement
Advertisement