బాలీవుడ్లో మైకేల్ జాక్సాన్ కూతురు | Michael Jackson daughter in bollywood movie | Sakshi
Sakshi News home page

బాలీవుడ్లో మైకేల్ జాక్సాన్ కూతురు

Apr 6 2017 4:35 PM | Updated on Sep 5 2017 8:07 AM

బాలీవుడ్లో మైకేల్ జాక్సాన్ కూతురు

బాలీవుడ్లో మైకేల్ జాక్సాన్ కూతురు

ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హాలీవుడ్ నటులు కనిపించారు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది

ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హాలీవుడ్ నటులు కనిపించారు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్లో బాలీవుడ్ సినిమాలో నటించనుంది. ఇప్పటికే పారిస్ను సంప్రదించిన మూవీ టీం ఆమె అంగీకారం పొందారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

బాలీవుడ్ బ్యూటి రిచా ఛడ్డా, పాకిస్తానీ నటుడు అలీ ఫజల్లు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాలో పారిస్ జాక్సన్ కీలక పాత్రలో నటించనుంది. ప్రధానంగా ఇంగ్లీష్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారతీయ సినిమాగానే తెరకెక్కిస్తున్నారు. పారిస్ జాక్సన్కు జంటగా ఓ హాలీవుడ్ నటుణ్ని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement