చాన్స్‌ కొట్టేశారా? | Megha Akash romantic relationship with Nani | Sakshi
Sakshi News home page

చాన్స్‌ కొట్టేశారా?

Jan 18 2019 1:02 AM | Updated on Jan 18 2019 1:02 AM

Megha Akash romantic relationship with Nani - Sakshi

మేఘా ఆకాశ్‌

తెలుగులో అనుకున్నంత స్పీడ్‌గా సినిమాలు ఒప్పుకోకపోయినా తమిళంలో మంచి ఫామ్‌తో దూసుకెళ్తున్నారు మేఘా ఆకాశ్‌. ఇటీవలే రజనీకాంత్‌ ‘పేట’ సినిమాలో చిన్న రోల్‌ కూడా చేశారు. తాజాగా తెలుగులో నాని సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్‌ కొట్టేశారని టాక్‌. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కుమార్, నాని కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

పీసీ శ్రీరామ్‌ కెమెరామేన్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా మేఘా ఆకాశ్‌ పేరుని ఫిక్స్‌ చేశారట. సినిమా అనౌన్స్‌మెంట్‌ రోజు ‘నాని... మరో ఐదుగురు’ అంటూ పేర్కొన్నారు చిత్రబృందం. అంటే ఈ సినిమాలో ఐదుగురు భామలు ఉండే ఛాన్స్‌ ఉందా? వేచి చూడాలి. ‘జెర్సీ’ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూట్‌లో జాయిన్‌ అవుతారట నాని.

Advertisement
 
Advertisement
Advertisement