రామ్ చరణ్ మోసం చేశాడు | mega star chiranjeevi Khaidi No 150 birthday Teaser | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్ మోసం చేశాడు

Aug 22 2016 10:17 AM | Updated on Sep 4 2017 10:24 AM

రామ్ చరణ్ మోసం చేశాడు

రామ్ చరణ్ మోసం చేశాడు

ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా. చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు...

ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా. చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా మీద ఆసక్తి పెంచేలా రోజుకో అప్ డేట్తో ఊరిస్తున్నాడు నిర్మాత, మెగా తనయుడు రామ్ చరణ్. అంతేకాదు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా చిరు ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తామంటూ ప్రకటించాడు చరణ్.

అయితే అన్నయ్య ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన యూనిట్, చిరంజీవిని మాత్రం షాడో షాట్స్తో చూపించాడు. ఎక్కడ చిరు ముఖాన్ని స్పష్టంగా చూపించకుండా కేవలం స్టైల్స్తో అలరించే ప్రయత్నం చేశాడు. టీజర్ చూడటానికి సూపర్గా అనిపిస్తున్నా, చిరు కనపడకపోవటం మాత్రం అభిమానులకు నిరాశకలిగిస్తోంది.  టీజర్ తో పాటు టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లలో కూడా చిరు ముఖం కనిపించకుండానే డిజైన్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement