ప్రేమలో కొత్త కోణం

Masakkali release date confirmed - Sakshi

సైకలాజికల్‌ ఎలిమెంట్స్‌ మిక్స్‌ అయిన న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన చిత్రం‘మసక్కలి’.  సాయిరోనక్, కావ్య, శిరీషలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నమిత్‌ సింగ్‌ నిర్మాత. నబి.యేనుగుబాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నమిత్‌ సింగ్‌ మాట్లాడుతూ–  ‘‘యూత్‌ను ఆకట్టుకునే పాయింట్‌తో పాటు ఓ కొత్త పాయింట్‌ను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం. సినిమా కథనం తప్పకుండా ఆకట్టుకుంటుంది. యూత్‌ఫుల్‌ లవ్‌లో కొత్త డైమన్షన్‌ను ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్‌ చేశారు మా దర్శకుడు నబి’’ అన్నారు. దర్శకుడు నబి మాట్లాడుతూ– ‘‘మా ‘మసక్కలి’ అందమైన ప్రేమకథలా ఉంటూనే సైకలాజికల్‌ గేమ్‌లా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని, కొత్త అనుభూతినిస్తుందనే గ్యారంటీ నాది’’ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top