‘మార్షల్‌’  పెద్ద హిట్‌ అవుతుంది : శ్రీకాంత్‌ | Marshal Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

‘మార్షల్‌’  పెద్ద హిట్‌ అవుతుంది : శ్రీకాంత్‌

Sep 11 2019 4:00 PM | Updated on Sep 11 2019 4:07 PM

Marshal Movie Pre Release Event - Sakshi

మార్షల్‌ సినిమా తనకు బాగా నచ్చిందని ప్రముఖ హీరో శ్రీకాంత్‌ అన్నారు. ఈ మూవీ పెద్ద హిట​ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభయ్‌, మేఘా చౌదరి జంటగా నటించిన మార్షల్‌ చిత్రంలో హీరో శ్రీకాంత్‌ ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హీరో అభయ్‌ తన సోంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై రాజాసింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శ్రీకాంత్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... అభయ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వడం ఆనందంగా ఉందన్నారు. తను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నట్టు చెప్పారు. హీరోగానే కాకుండా ఈ సినిమాతో నిర్మాతగా ఒక అడుగు ముందుకు వెయ్యడం సంతోషంగా ఉందన్నారు. మార్షల్ సినిమా చూసానని..  తను ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఈ మూవీ బెస్ట్ అని తెలిపారు.

అభయ్ మాట్లాడుతూ...‘మా మార్షల్ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్కు వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. అన్నీ జాగ్రత్తలు తీసుకొని మేము ఈ సినిమా తీశాము. స్వామి గారు  సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా గ్రాండ్‌గా వచ్చింది. నేను బాగా నటించడానికి చేయడానికి శ్రీకాంత్ సపోర్ట్ చేశారు. సెట్‌లో ఆయన చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. సాంగ్స్, ఫైట్స్, మదర్ సెంటిమెంట్ ఇలా అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. శ్రీకాంత్‌కు నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడు వచ్చినా బాగా రిసీవ్‌ చేసుకుంటారు. ఈ సినిమా అలాగే అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్న’ట్టు తెలిపారు.

డైరెక్టర్ జయరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మా హీరో, నిర్మాత అభయ్ నేను ఈ కథ చెప్పినప్పుడు విన్న వెంటనే చెయ్యడానికి ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్. కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. సెప్టెంబర్ 13న విడుదల అవుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంద’ని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘అభయ్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం సంతోషం. మొదటి సినిమాతోనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. భవిష్యత్తులో అతను నటుడిగా మరో మెట్టు ఎక్కాలని కోరుకుంటున్నాన’ని తెలిపారు.

వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ.. ‘నాకు ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన హీరో అభయ్‌కు థాంక్స్. నేను ఈ సినిమాలో రాసిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాన’ని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సుర్ మాట్లాడుతూ...‘కేజీఎఫ్‌ సినిమా తరువాత నేను ఒప్పుకున్న సినిమా మార్షల్. కథ నచ్చి వెంటనే ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించాను. దర్శకుడు ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిర్మాత, హీరో అభయ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడు. సినిమా బాగా వచ్చింద’ని అన్నారు.

హీరోయిన్ మేఘా చౌదరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అభయ్ తో కలిసి నటించడం బెస్ట్ మెమోరీస్‌ను ఇచ్చింది. సెప్టెంబర్13న వస్తున్న మా సినిమాను చూసి ఆదరించండి. హీరో శ్రీకాంత్ సెట్స్ లో బాగా సపోర్ట్ చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు’ అని తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో రష్మి సమాంగ్, సుమన్, వినోద్‌కుమార్, శరణ్య, పృథ్వీరాజ్, రవిప్రకాష్, ప్రియదర్శిని రామ్, ప్రగతి, కల్పవల్లి, సుదర్శన్‌ తదిరులు నటిస్తున్నారు. వరికుప్పల యాదగిరి సంగీతం అందించగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రుర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్, మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల, ఫైట్స్ : నాభ, సుబ్బు, ఎడిటర్ : చోట కె ప్రసాద్, పాటలు : యాదగిరి వరికుప్పల, కళా దర్శకుడు : రఘు కులకర్ణి, డాన్స్ మాస్టర్ : గణేష్, ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్నరావు ధవళ, నిర్మాత : అభయ్ అడకా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement