వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం

Manjula ropes in Awe director for a Web series - Sakshi

‘అ!’ సినిమాతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఆ తర్వాత సగం కంప్లీట్‌ అయిన సినిమాకి దర్శకుడిగా మారి ‘దటీజ్‌ మహాలక్ష్మీ’ సినిమాను కంప్లీట్‌ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్‌తో ఓ ఇన్‌వెస్టిగేటీవ్‌ థ్రిల్లర్‌ రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ఈ గ్యాప్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా డైరెక్ట్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారట దర్శకుడు. ఈ వెబ్‌ సిరీస్‌ను ఘట్టమనేని మంజుల నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి అని సమాచారం. మరి ఈ సినిమా జానర్‌ ఏంటి? పెద్ద యాక్టర్స్‌ నటిస్తారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top