పెళ్లి చేసుకోనున్న స్టార్‌ జంట! | Manish Raisinghan To Tie Knot With Sangeita Chauhan | Sakshi
Sakshi News home page

ప్రేయసిని పెళ్లాడనున్న నటుడు

Jun 26 2020 3:20 PM | Updated on Jun 26 2020 3:48 PM

Manish Raisinghan To Tie Knot With Sangeita Chauhan - Sakshi

టీవీ నటుడు, ‘ససురాల్‌ సిమర్‌ కా’ ఫేం మనీశ్‌ రాయ్‌సింఘన్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, నటి సంగీత చౌహాన్‌ను వివాహమాడనున్నాడు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలోని గురుద్వారలో జూన్‌ 30న వీరి పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా సీరియల్‌ నటుడిగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మనీశ్‌.. ‘హీరోయిన్‌’సినిమాతో వెండితెరపై తళుక్కుమన్నాడు. (తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్‌ తండ్రి)

ఈ క్రమంలో తనతో కలిసి ఏక్‌ శ్రింగార్‌- స్వాభిమాన్‌ సీరియల్‌లో నటించిన సంగీతతో ప్రేమలో పడిన అతడు.. పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లిచేసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో మనీశ్‌ స్నేహితురాలు, నటి అవికాగోర్‌ సోషల్‌ మీడియా వేదికగా కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజునే వీరి వివాహం జరుగనుందని హర్షం వ్యక్తం చేశారు. కాగా గతంలో మనీశ్‌- అవిక డేటింగ్‌ చేసినట్లు, పెళ్లి కూడా చేసుకున్నట్లు వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే.(డబ్బుల్లేవు.. వేరే ఆప్షన్‌ లేదు: నటుడు)

Advertisement
 
Advertisement
Advertisement