దర్శకుడిగా మారిన యంగ్‌ హీరో | Manchu Vishnu Turns Director For Ad Film | Sakshi
Sakshi News home page

Mar 10 2018 3:11 PM | Updated on Mar 10 2018 3:40 PM

Manchu Vishnu Turns Director For Ad Film - Sakshi

మంచు విష్ణు

హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్న యంగ్ హీరో మంచు విష్ణు, దర్శకుడిగానూ తన టాలెంట్‌ నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా తన తొలి ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు విష్ణు. ఈ ప్రాజెక్ట్‌లో విష్ణు తండ్రి, విలక్షణ నటుడు మోహన్‌బాబు నటిస్తున్నారు. అయితే విష్ణు దర్శకత్వం వహించింది సినిమాకు కాదు. ఓ ప్రభుత్వ ప్రకటన కోసం దర్శకుడిగా మారాడు మంచు విష్ణు.

నీటి వనరుల ఆవశ్యకత వాటిన సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలిపే విధంగా ఈ ప్రకటనను తీర్చి దిద్దుతున్నారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ పనులు పూర్తి చేశారు. మరో వారంలో రోజుల్లో ఈ యాడ్ విడుదల కానుంది. పూర్తిగా రెడీ అయిన తరువాత యాడ్‌ను జలవనరుల మంత్రిత్వ శాఖకు అంధించనున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆచారి అమెరికా యాత్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఓటర్‌ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement