హాలీవుడ్‌లోకి దూసుకెళ్తా | Manchu Vishnu to try his luck in Hollywood? | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌లోకి దూసుకెళ్తా

Dec 25 2017 12:08 AM | Updated on Dec 25 2017 12:08 AM

Manchu Vishnu to try his luck in Hollywood? - Sakshi

మంచు లక్ష్మీ తెలుగు తెరకు పరిచయం కాక ముందు కొన్ని హాలీవుడ్‌ చిత్రాల్లో కనిపించారు. తమ్ముడు మంచు విష్ణు మాత్రం ముందు ఇక్కడ కనిపించి, అక్కడికెళుతున్నారు. అయితే విష్ణు నటుడిగా కాకుండా నిర్మాతగా హాలీవుడ్‌కు వెళ్లనున్నారు. నయా ప్రొడక్షన్‌ హౌస్‌ ‘వియమ్‌ఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ ద్వారా ఫారిన్‌ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయబోతున్నారు. బాగా నచ్చి, ఇక్కడ ప్రస్థావించలేని కొన్ని కథలను అక్కడ చెప్పాలనుకుంటున్నారు.

అందుకే ఈ కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ ఆరంభించారు. విష్ణు దగ్గర బ్రిటీష్, ఆస్ట్రేలియాకు సంబంధించిన టñ క్నీషియన్స్‌ కూడా ఉన్నారు. ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ ద్వారా నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ వంటి డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌తో కూడా అసోసియేట్‌ అవ్వాలనే ఆలోచనలో విష్ణు ఉన్నారని సమాచారం. హాలీవుడ్‌లో నిర్మాతగా తొలి ప్రాజెక్ట్‌ గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన కాల్‌ సెంటర్‌ స్కామ్‌ ఆధారంగా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement