నాన్నకు ప్రేమతో : మంచు విష్ణు | Manchu Vishnu Sons name Avram Bhakta Manchu | Sakshi
Sakshi News home page

Jan 4 2018 1:52 PM | Updated on Sep 2 2018 4:37 PM

Manchu Vishnu Sons name Avram Bhakta Manchu - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు భార్య విరోనిక పండంటి మగ బిడ‍్డకు జన్మనిచ్చింది. తాజాగా తన వారసుడిగా పెట్టిన పేరును మంచు విష్ణును ఆసక్తికరమైన ట్వీట్ తో వెల్లడించారు. ఇప్పటికే మంచు విష్ణుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు చిన్నారి తమ్ముడిని బేబీ లయన్, బేబీ టెడ్డీ బేర్ అని పిలుస్తున్నారట. అయితే మిగతా వాళ్లు మాత్రం ‘అవ్రామ్ భక్త మంచు’ అని పిలుస్తున్నాం అంటూ కొడుకుకి పెట్టిన పేరును ప్రకటించాడు విష్ణు.

అవ్రామ్ అంటే ‘ఎవరూ ఆపలేని వ్యక్తి’ అని తెలిపాడు మంచు విష్ణు. అదే సమయంలో కొడుకు పేరులో భక్త అన్న పదాన్ని చేర్చటం కూడా ఆసక్తికరంగా మారింది. విష్ణు తండ్రి సీనియర్ నటుడు మెహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అన్న విషయం తెలిసిందే. తండ్రి మీద ప్రేమతోనే విష్ణు.. కొడుకుకు అవ్రామ్ భక్త అని పేరు పెట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement