అవ్రమ్‌కు హెయిర్‌ కట్ చేసిన విరానిక | Manchu Viranica Cutting Her Son Avram Hair | Sakshi
Sakshi News home page

అవ్రమ్‌కు హెయిర్‌ కట్ చేసిన విరానిక

May 1 2020 1:02 PM | Updated on May 1 2020 1:25 PM

Manchu Viranica Cutting Her Son Avram Hair - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరాలు మినహా అన్నిషాప్‌లు మూతపడ్డాయి. దీంతో చాలా పనులు పెండింగ్‌లో పడిపోయాయి. కనీసం బయటకు వెళ్లి హెయిర్‌కట్‌ చేయించుకోలేని పరిస్థితి. దీంతో కొందరకు ఇళ్లల్లోనే తమకు తోచిన రీతిలో షేవింగ్‌, హెయిర్‌కట్‌ చేసుకుంటున్నారు. ఇలా తమలోని కొత్త ట్యాలెంట్‌ను బయటకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే.. కొందరు తల్లిదండ్రులే వారికి హెయిర్‌ కట్‌ చేసి మురిసిపోతున్నారు. తాజాగా హీరో మంచు విష్ణు సతీమణి విరానిక కూడా ఈ జాబితాలో చేరిపోయారు.

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన విరానిక.. తన కుమారడు అవ్రమ్‌కు హెయిర్‌ కట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘అవ్రమ్‌ హెయిర్‌ కట్‌ చేశాను. ఇలా చేయడం ఇదే తొలిసారి’ అని విరానిక పేర్కొన్నారు. అలాగే అందరూ ఇంట్లోనే ఉండాలని, క్షేమంగా ఉండాలని  పిలుపునిచ్చారు. అయితే హెయిర్‌కట్‌ చేసే సమయంలో ఏం జరుగుతుతందో తెలుసుకోవడానికి అవ్రమ్‌ పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ.. చేసిన అల్లరి చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోపై ప్రముఖ హీరోయిన్‌ హన్సిక స్పందిస్తూ.. ‘సో క్యూట్‌ విన్నీ’ అని కామెంట్‌ చేశారు. మరోవైపు ఇండియాలో ఉన్న విష్ణు విరానికను, పిల్లలను చాలా మిస్‌ అవుతున్నానని ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. చదవండి : భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: మంచు విష్ణు

Advertisement
 
Advertisement
Advertisement