గిలిగింతలు పెట్టే ప్రేమ | manase maya movie | Sakshi
Sakshi News home page

గిలిగింతలు పెట్టే ప్రేమ

Oct 30 2015 11:15 PM | Updated on Sep 3 2017 11:44 AM

గిలిగింతలు పెట్టే ప్రేమ

గిలిగింతలు పెట్టే ప్రేమ

హారర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మనసే మాయ’.

హారర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో  తెరకెక్కుతున్న చిత్రం ‘మనసే మాయ’. సాయికిరణ్, ప్రాచి అధికారి జంటగా ఎం. బల్వాన్ దర్శకత్వంలో సునీల్‌సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘గిలిగింతలు పెట్టే ప్రేమకథతో పాటు ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లింగ్, హారర్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఇందులో ఉన్న ఏడు పాటల్లో మూడు పాటల చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలో మిగతా నాలుగు పాటలను పూర్తి చేస్తాం. డిసెంబరులో పాటలను, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.కె.మజ్నూ, ఛాయాగ్రహణం: ప్రసాద్, సహ-నిర్మాతలు: ఎం.భాగ్యలక్ష్మి, కె.ఫిష్‌లక్ష్మి.

Advertisement
 
Advertisement
Advertisement