ఛానళ్లతో ఢీ.. నేను రెడీ! | Manalo Okadu movie release on 4th | Sakshi
Sakshi News home page

ఛానళ్లతో ఢీ.. నేను రెడీ!

Nov 1 2016 11:17 PM | Updated on Oct 9 2018 7:52 PM

ఛానళ్లతో ఢీ.. నేను రెడీ! - Sakshi

ఛానళ్లతో ఢీ.. నేను రెడీ!

‘‘సంచలన వార్తల పేరుతో టీవీ ఛానళ్లు నిజాలను పక్కన పెడుతున్నాయి. ఆ మీడియా వ్యవస్థపై పోరాడిన ఓ అధ్యాపకుడు కృష్ణమూర్తి కథ ఇది.

‘‘సంచలన వార్తల పేరుతో టీవీ ఛానళ్లు నిజాలను పక్కన పెడుతున్నాయి. ఆ మీడియా వ్యవస్థపై పోరాడిన ఓ అధ్యాపకుడు కృష్ణమూర్తి కథ ఇది. ఎవర్నీ టార్గెట్ చేయలేదు. సినిమా చూసి ఎవరైనా హర్టయితే ఆ పర్యవసానాలను ఎదుర్కోవడా నికి నేను రెడీ’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘మనలో ఒకడు’.

గురజాల జగన్మోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలవుతోంది. ఆర్పీ మాట్లాడుతూ - ‘‘మీడియాలో ప్లస్సూ, మైసస్సూ.. రెండూ ఉన్నాయి. ఈ సినిమాలో మైనస్సులు చూపిస్తున్నా. నిర్మాత సెన్సార్ అవుతుందో? లేదోనని భయపడ్డారు. ఇలాంటి సినిమాలు ప్రస్తుతం అవసర మని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. తదుపరి సినిమాతీయాలనుకుంటున్నా’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement