సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..? | mammootty to play an important role in rajinikanths kaala | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..?

Jun 4 2017 12:42 PM | Updated on Sep 5 2017 12:49 PM

సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..?

సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా కాలా. కబాలి లాంటి భారీ చిత్రాన్ని అందించిన రజనీకాంత్, పా రంజిత్ల

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా కాలా. కబాలి లాంటి భారీ చిత్రాన్ని అందించిన రజనీకాంత్, పా రంజిత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రజనీతో పాటు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటిస్తుండటంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.

తాజాగా మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. రజనీ మాఫీయా డాన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దళపతి సినిమాలో కలిసి నటించిన ఈ స్టార్స్ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తెరను పంచుకోవటం హాట్ టాపిక్ మారింది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement
 
Advertisement
Advertisement