యుద్ధవీరుడిగా మమ్ముట్టి

Mammootty Next Mamangam First Look Poster - Sakshi

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్‌ డ్రామా మమాంగం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ఫస్ట్‌లుక్‌లో మమ్ముట్టి కేరళ సాంప్రదాయ యుద్ధవీరుడిగా కనిపిస్తున్నాడు. మమాంగం అనే పండుగ సందర్భంగా జరిగే వివాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.

17వ శతాబ్దం నాటి కథతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీ తొలి షెడ్యూల్‌ సంజీవ్‌ పిళ్ళై దర్శకత్వం వహించగా తరువాతి షెడ్యూల్‌ నుంచి ఎం పద్మకుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ప్రాచీ తెహ్లన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలోఉన్ని ముకుందన్‌, అను సితార, మాళవికా మీనన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top