మాలీవుడ్ మాదే | mallywood:samantha | Sakshi
Sakshi News home page

మాలీవుడ్ మాదే

May 10 2014 2:02 AM | Updated on Sep 2 2017 7:08 AM

మాలీవుడ్ మాదే

మాలీవుడ్ మాదే

మాలీవుడ్ మాదే అని అంటున్నారు చెన్నై భామ సమంత.

మాలీవుడ్ మాదే అని అంటున్నారు చెన్నై భామ సమంత. ఈ బ్యూటి మాటలకు కొంచెం క్లారిటీ కావాలా? ఈ అమ్మడి తల్లి కేరళలోని ఆలప్పుళంలో జన్మించారట. దీంతో మాలీవుడ్ తన మాతృగడ్డేనంటున్నారు. ఇంతకీ ఈ బ్యూటి గోడేమిటంటారా? ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజి హీరోయిన్‌గా వెలిగిపోతున్నారు. మరో విశేషం ఏమిటంటే ఇటీవలే బాలీవుడ్ నుంచి సమంతకు పిలుపు వచ్చింది. అక్కడ క్రేజీ స్టార్ అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు.

దీంతో మరో కోలీవుడ్ లక్కీ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు సమంత పోటీగా తయారవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. నటి సమంత తాజాగా మాలీవుడ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మలయాళంలో నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే తన తల్లి పుట్టింది ఆలప్పుళం అనే విషయాన్ని బయటపెట్టి ఆ విధంగా సెంటిమెంట్‌తో మాలీవుడ్‌లోనూ పాగా వేయాలని చూస్తున్నట్లు చెప్పకనే చెప్పింది.

ఏదేమైనా సమంత మాలీవుడ్ కోరిక అక్కడి హీరోయిన్లకు పెద్దగానే షాక్ ఇచ్చింది. వాస్తవానికి అక్కడ హీరోయిన్ల కొరత ఉంది. ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్లుగా వెలుగొందుతున్న కావ్యా మాధవన్, రీమా కళింగళ్, మంజు వారియర్, అనన్య వంటి వారు వివాహితులయ్యారు.

ఇకపోతే అక్కడ యువ హీరోయిన్లుగా పరిచయమైన కొందరు కోలీవుడ్‌లో అవకాశాలు రావడంతో జంప్ జలాని బాట పడుతున్నారు. మేగ్నారాజ్, భావన, భామ వంటి హీరోయిన్లు మాలీవుడ్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇక సమంత విషయానికొస్తే టాలీవుడ్, కోలీవుడ్‌లో మాదిరిగానే మాలీవుడ్‌లోను చక్రం తిప్పాలని ఆశిస్తున్నారు. ఇక ఈ జాణ ఆకాంక్ష ఎంత వరకు నెరవేరుతుంతో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement