ప్రేయసిని పెళ్లాడిన నటుడు | Malayalam Actor Gokulan Tied Knot to Dhanya During Lockdown | Sakshi
Sakshi News home page

నిరాడంబరంగా నటుడి వివాహం

May 28 2020 3:26 PM | Updated on May 28 2020 3:42 PM

Malayalam Actor Gokulan Tied Knot to Dhanya During Lockdown - Sakshi

తిరువనంతపురం: మలయాళ నటుడు గోకులన్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు ధన్యను గురువారం వివాహమాడాడు. స్వస్థలం ఎర్నాకుళంలోని ఓ గుడిలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ జంట పెళ్లి జరిగింది. గోకులన్‌ తెలుపు రంగు షర్టు, దోవతి ధరించగా... ధన్య ఎరుపు రంగు చీర కట్టుకుని ముస్తాబయ్యారు. ఇక ఇద్దరు తమ దుస్తులకు మ్యాచ్‌ అయ్యే మాస్కులు ధరించడం విశేషం. (నాకు కరోనా సోకలేదు.. కానీ: నటి)

ఇక అత్యంత నిరాడంబరంగా జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను నటుడు జయసూర్య ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసి.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా గోకులన్‌- ధన్యను అభిమానులు విష్‌ చేస్తున్నారు. కాగా థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ఆరంభించిన గోకులన్‌ లాల్‌ బహదూర్‌ శాస్త్రి, సప్తమాశ్రీ తస్కరహ, రమంతే ఎదన్‌తోట్టం వంటి సినిమాల్లో నటించాడు. పున్యలన్‌ అగర్‌బత్తీస్‌ సినిమాతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. (జోయాపై ఆదిత్య ఠాక్రే ప్రశంసలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement