నాకు కరోనా సోకలేదు.. కానీ: నటి

Mandana Karimi Clarifies That She Does Not Have Corona Virus - Sakshi

ముంబై: తనకు ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సోకలేదని నటి మందనా కరిమి స్పష్టం చేశారు. అయితే తాను కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నానని పేర్కొన్నారు. కాగా కొన్నిరోజులుగా మందన కరోనా బారిన పడినట్లు రూమర్లు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో అభిమానులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్తలపై స్పష్టతనివ్వాల్సిందిగా సోషల్‌ మీడియా వేదికగా ఆమెను కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన మందన కరిమి.. తన పట్ల ఇంతటి ప్రేమ కురిపిస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. (రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మృతి)

‘‘ నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. కంటికి ఇన్‌ఫెక్షన్‌ సోకిందంతే. అందుకే రక్తనాళాలు ఇలా ఉబ్బిపోయాయి. రోజూ ఇంటిని శుభ్రం చేసేందుకు, రసాయనాలు చల్లేందుకు సమయాన్ని కేటాయిస్తున్నా. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా జరిగింది. డాక్టర్‌ దగ్గరికి వెళ్లాను. అన్నట్లు నాకు కరోనా సోకలేదు. ప్రేమను పంచండి. సంతోషంగా ఉండండి. నెగటివ్‌గా ఉండేవాళ్లను మనం పట్టించుకోకూడదు’’అని మందన చెప్పుకొచ్చారు. కాగా మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన మందన.. రాయ్‌, భాగ్‌ జానీ, క్యా కూల్‌ హై హమ్‌ 3 వంటి సినిమాల్లో నటించారు. అదే విధంగా హిందీ బిగ్‌బాస్‌-9లో రన్నరప్‌గా నిలిచి ఎనలేని క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఇక ఇష్క్‌బాజ్‌ సీరియల్‌తో టీవీ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టారు. ఇక 2017లో వ్యాపారవేత్త గౌరవ్‌ గుప్తాను పెళ్లాడిన మందన.. గతంలో భర్తపై గృహహింస కేసు పెట్టారు. అనంతరం కేసును విత్‌డ్రా చేసుకున్నారు.(పెళ్లి పేరుతో మోసం చేశాడు)

The ugly Thruth ❤️ #quarantine #life

A post shared by Mandanakarimi (@mandanakarimi) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top