సీరియస్‌ విజన్‌తో మహేష్‌ బాబు | Mahesh Serious Vision for Bharat Ane Nenu | Sakshi
Sakshi News home page

Mar 5 2018 3:46 PM | Updated on Mar 5 2018 3:46 PM

Mahesh Serious Vision for Bharat Ane Nenu - Sakshi

భరత్‌ అనే నేనులో మహేష్‌ బాబు

సాక్షి, సినిమా : సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కు మరో కానుకను అందించేందుకు రంగం సిద్ధమైపోయింది. భరత్‌ అనే నేను చిత్ర యూనిట్‌ మార్చి 6న సాయంత్రం ఆరు గంటలకు మరో ప్రోమోను వదలబోతున్నారు. 

‘ది విజన్‌ ఆఫ్‌ భరత్‌’ పేరిట చిన్న వీడియో బైట్‌ను వదలబోతున్నట్లు తెలుస్తోంది. కుర్చీపై చెయ్యేసి సీరియస్‌గా ఉన్న మహేష్‌.. వెనకాలే స్క్రీన్‌ మీద ఫస్ట్‌ ఓత్‌ లోని పదాలు గమనించవచ్చు. 

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో అలరించబోతున్నాడు. బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఏప్రిల్‌ 20న చిత్రం విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement