భరత్‌ అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా.. | Bharat Ane Nenu first oath launched today | Sakshi
Sakshi News home page

భరత్‌ అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా..

Jan 26 2018 7:47 AM | Updated on Jan 26 2018 8:03 AM

Bharat Ane Nenu first oath launched today - Sakshi

రిపబ్లిక్‌డే సందర్భంగా మహేష్‌ బాబు అభిమానులకు మంచి కానుక అందించారు. ​కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్‌ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిని ఖాయం చేస్తూ మహేష్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లుగా ఉన్న ఆడియోను రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదల చేశారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ సోషల్‌ మీడియా వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మహేష్‌ కనిపించనున్నారు.

ఇక ఈ ఆడియోలో మహేష్‌ బాబు ' భరత్‌ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం,  విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాకర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగా కాని,  పక్షపాతంగా కాని, రాగద్వేశాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అంటూ అభిమానులను అలరించారు.

Advertisement
 
Advertisement
Advertisement