ఇక్కడ మహేశ్..అక్కడ విజయ్..350 కోట్ల బడ్జెట్!! | Mahesh In Telugu, Vijay In Tamil? | Sakshi
Sakshi News home page

ఇక్కడ మహేశ్..అక్కడ విజయ్..350 కోట్ల బడ్జెట్!!

Jul 3 2016 11:15 PM | Updated on Sep 4 2017 4:03 AM

ఇక్కడ మహేశ్..అక్కడ విజయ్..350 కోట్ల బడ్జెట్!!

ఇక్కడ మహేశ్..అక్కడ విజయ్..350 కోట్ల బడ్జెట్!!

‘ఒక్కడు’, ‘పోకిరి’.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాలు. తమిళ హీరో విజయ్ ఈ సినిమాలను కోలీవుడ్‌లో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు.

 ‘ఒక్కడు’, ‘పోకిరి’.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాలు. తమిళ హీరో విజయ్ ఈ సినిమాలను కోలీవుడ్‌లో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడీ స్టార్ హీరోలిద్దరితో ఒకే సినిమా తీయాలని తమిళ దర్శకుడు సుందర్.సి ప్రయత్నిస్తున్నారట. చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం బడ్జెట్ 350 కోట్ల రూపాయలు.
 
  సంగీతం సలచలనం ఏఆర్ రెహమాన్, ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు కమల్‌కణ్ణన్ తదితర హేమాహేమీలు ఈ సినిమాకి పనిచేయనున్నారు. అయితే.. ఇది మల్టీస్టారర్ సినిమా కాదు. తెలుగు వెర్షన్‌లో మహేశ్‌బాబు, తమిళ వెర్షన్‌లో విజయ్ హీరోలుగా నటిస్తే బాగుంటుందని దర్శకుడి ఆలోచన. ఈ ఇద్దర్నీ కలసి కథ కూడా వినిపించారని కోలీవుడ్ టాక్. మరి, హీరోలు అంగీకరించారో? లేదో? తెలియదు.
 
  హిందీలో కూడా తీస్తారట. బాలీవుడ్‌లో ఇంకా ఎవరికీ కథ చెప్పలేదు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ సంస్థకు ఇది నూరవ చిత్రం. దాంతో ఖర్చుకు వెనుకాడకుండా భారీగా నిర్మించాలనుకుంటున్నారు. తెలుగులో మహేశ్, తమిళంలో విజయ్ హీరోలుగా ‘3 ఇడియట్స్’ను రీమేక్ చేయాలని దర్శకుడు శంకర్ గతంలో ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. ఈసారి ఏం జరుగుతుందో!!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement