నెట్టింట్లోకి నిర్మాతగా... | Mahesh Babu's first web series title revealed | Sakshi
Sakshi News home page

నెట్టింట్లోకి నిర్మాతగా...

Feb 1 2019 2:56 AM | Updated on Feb 1 2019 2:56 AM

Mahesh Babu's first web series title revealed - Sakshi

మహేశ్‌ బాబు

డిజిటల్‌ మాధ్యమాల్లో సిరీస్‌లకు, షోలకు పాపులారిటీ రోజు రోజుకు పెరుగుతోంది. టాప్‌ లిస్ట్‌ యాక్టర్స్‌ కూడా ఇందులో నటించడానికి సంకోచించడం లేదు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మహేశ్‌ బాబు కూడా జాయిన్‌ అయ్యారు. అయితే మహేశ్‌ నటించడంలేదు నిర్మించనున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు మహేశ్‌. ఇప్పుడు యంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ ద్వారా నెట్టింట్లోకి నిర్మాతగా ప్రవేశిస్తారు. ఓ డిటెక్టివ్‌ సిరీస్‌ని నిర్మించనున్నారట. ‘మీకు మీరే మాకు మేమే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హుస్సేన్‌ షా కిరణ్‌ ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

ఆల్రెడీ కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌ ద్వారా నెట్లో హుస్సేన్‌కు మంచి పేరుంది. ఈ వెబ్‌ సిరీస్‌కు ‘చార్లీ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. ఈ సిరీస్‌ను 3 సీజన్లుగా, ఒక్కో సీజన్‌లో 8 ఎపిసోడ్లు ఉండేట్లుగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఒక్కో ఎపిసోyŠ  సుమారు గంట నిడివితో పాటు సినిమా స్థాయిలో ఉంటుందట. ప్రముఖ కెమెరామేన్‌ ప్రసాద్‌ మూరెళ్ల అసిస్టెంట్‌ నివాస్‌ కెమెరామేన్‌గా, కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా చేయనున్నారు. మరి నటీనటుల వివరాలు తెలియాలి.  ఈ వెబ్‌ సిరీస్‌ బాధ్యతలు మహేశ్‌ భార్య నమ్రత చూసుకోనున్నారట. అలాగే జియో నిర్మాణ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement