గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌! | Mahesh Babu Special Gift On His Birthday | Sakshi
Sakshi News home page

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

Aug 1 2019 2:21 PM | Updated on Aug 1 2019 2:21 PM

Mahesh Babu Special Gift On His Birthday - Sakshi

మహర్షి సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మహేష్ ఓ సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తున్నాడట‌.

ఈ నెల 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఓ మైక్రో టీజర్‌తో పాటు మహేష్‌ లుక్‌ను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement