లొకేషన్‌ చేంజ్‌ | mahesh babu new movie maharshi next schedule in pollachi | Sakshi
Sakshi News home page

లొకేషన్‌ చేంజ్‌

Dec 24 2018 1:18 AM | Updated on Aug 22 2019 9:35 AM

mahesh babu new movie maharshi next schedule in pollachi - Sakshi

మహేశ్‌బాబు

కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే షూటింగ్‌ చేస్తున్న మహేశ్‌బాబు నెక్ట్స్‌ షెడ్యూల్‌కు లొకేషన్‌ చేంజ్‌ చేయనున్నారట. ఆ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వనీ దత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌ షెడ్యూల్‌ ఆదివారం ముగిసిందని సమాచారం.

సుమారు 2 కోట్ల వ్యయంతో రూపొందించిన విలేజ్‌ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్ట్స్‌ ‘మహర్షి’ టీమ్‌ పొల్లాచికి షిఫ్ట్‌ అవ్వనున్నారట. ఈ నెలాఖరి నుంచి పొల్లాచి షెడ్యూల్‌ స్టార్ట్‌ కానుంది. మహేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణమంతా అందులో పాల్గొంటారట. ఈ చిత్రంలో మహేశ్‌ స్నేహితుడిగా ‘అల్లరి’ నరేశ్‌ కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

పూర్తి స్థాయి ప్రొడ్యూసర్‌గా?
ఇన్ని రోజులు కేవలం తాను నటించిన సినిమా నిర్మాణంలో భాగమయ్యారు మహేశ్‌బాబు. తాజాగా నిర్మాణ రంగంలోనూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నారట. అందులో భాగంగానే వెబ్‌ సిరీస్‌లు, చిన్న బడ్జెట్‌ సినిమాలను నిర్మించాలనుకుంటున్నారట మహేశ్‌. దానికి సంబంధించిన చర్చలను కూడా జరుపుతున్నట్టు సమాచారం. కొత్త టాలెంట్, సరికొత్త ఐడియాలను ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నారట. జనవరి నుంచి మహేశ్‌ నిర్మించే వెబ్‌ సిరీస్‌ స్టార్ట్‌ కానుందని టాక్‌. ఆల్రెడీ థియేటర్స్‌ బిజినెస్‌లోకి మహేశ్‌ ఇటీవలే అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement