మహేష్ ‘మహర్షి’ వాయిదా | Mahesh Babu Maharshi Release Postponed | Sakshi
Sakshi News home page

మహేష్ ‘మహర్షి’ వాయిదా

Feb 23 2019 1:55 PM | Updated on Apr 7 2019 12:28 PM

Mahesh Babu Maharshi Release Postponed - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్‌ 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకుడు. భరత్‌ అనే నేను లాంటి భారీ హిట్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా కావటంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఏప్రిల్ నెలాఖరున మహర్షి సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్‌ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన లేకపోయినా... వాయిదా పడటం దాదాపుగా కన్ఫామ్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement