గుమ్మడికాయ కొట్టారు | Mahesh Babu Maharshi Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టారు

Apr 19 2019 12:35 AM | Updated on Aug 22 2019 9:35 AM

Mahesh Babu Maharshi Movie Shooting Completed - Sakshi

మహేశ్‌బాబు

రిషి పాత్రకు మహేశ్‌బాబు బై బై చెప్పేశారు. ‘మహర్షి’ సినిమా విశేషాలు ఫాలో అవుతున్నవారికి ఈ సినిమాలో మహేశ్‌ చేసిన పాత్ర పేరు రిషి అని తెలిసే ఉంటుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు, పూజాహెగ్డే జంటగా అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మించిన చిత్రం ‘మహర్షి’. ఓ ప్రధాన పాత్రలో ‘అల్లరి’ నరేశ్‌ నటించారు. ఈ సినిమా షూటింగ్‌ ఓ పాట చిత్రీకరణతో గురువారం ముగిసింది. సినిమా పూర్తయిన సంతోషాన్ని కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు మహేశ్‌ అండ్‌ టీమ్‌. మహేశ్‌ కెరీర్‌లో ‘మహర్షి’ 25వ చిత్రం కావడం విశేషం. ‘‘మే9న థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు మహేశ్‌బాబు.

‘‘మహర్షి జర్నీ లాంగ్‌ టైమ్‌ గుర్తుండిపోతుంది. నన్ను నమ్మి సపోర్ట్‌ చేసిన మహేశ్‌సార్‌కి థ్యాంక్స్‌. టీమ్‌ అందరూ సహకరించారు’’ అన్నారు వంశీ పైడిపల్లి. ఈ చిత్రంలో మహేశ్‌బాబు స్టూడెంట్‌గా, బిజినెస్‌మన్‌గా కనిపిస్తారు. రైతు పాత్రలో కూడా నటించారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ‘అల్లరి’ నరేశ్‌ క్యారెక్టర్‌ పేరు రవి. మహేశ్‌ ఫ్రెండ్‌గా నరేశ్‌ కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్‌ లుక్‌లతో పాటు రెండు పాటలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ‘ఎవరెస్ట్‌ అంచున’ అనే డ్యూయెట్‌ సాంగ్‌ వీడియో ప్రివ్యూ విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement