చిన్న బ్రేక్‌

Mahesh Babu Family Heads For New Year Vacation - Sakshi

ఒక సినిమా చేసేటప్పుడు వర్క్‌ మూడ్‌లో ఉండే మహేశ్‌బాబు అది పూర్తి కాగానే హాలిడే మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ మూడ్‌లోనే ఉన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. ఆ వెంటనే తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పేశారు మహేశ్‌. దాంతో రిలీఫ్‌ అయిపోయారు. ఫ్యామిలీతో చిన్న హాలిడే ట్రిప్‌ ప్లాన్‌ చేశారని సమాచారం. జస్ట్‌ వారం రోజులు ఫ్యామిలీతో రిలాక్స్‌ అయి, ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోతారు. మహేశ్‌బాబు సరసన రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. హైదరాబాద్‌లో జనవరి 5న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుక జరగనుంది. ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top