కథలు వినడంలో బిజీ | Mahesh Babu doing great at Tamil strategy | Sakshi
Sakshi News home page

కథలు వినడంలో బిజీ

Apr 11 2016 10:25 PM | Updated on Sep 3 2017 9:42 PM

కథలు వినడంలో బిజీ

కథలు వినడంలో బిజీ

‘బ్రహ్మోత్సవం’ చిత్రీకరణలో బిజీబిజీగా ఉన్న మహేశ్‌బాబు, ఓ పక్క తన తదుపరి సినిమాలకు స్క్రిప్ట్‌లు వింటూ ఓకే చేసేస్తున్నారా?

‘బ్రహ్మోత్సవం’ చిత్రీకరణలో బిజీబిజీగా ఉన్న మహేశ్‌బాబు, ఓ పక్క తన తదుపరి సినిమాలకు స్క్రిప్ట్‌లు వింటూ ఓకే చేసేస్తున్నారా? వరుస చూస్తే అలానే ఉంది. ఇప్పటికే మురుగుదాస్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి అభిమానులకు ఓ క్లారిటీ  ఇచ్చేశారు మహేశ్. తాజాగా మరో తమిళ దర్శకుడు చెప్పిన కథకు ఆయన ఇంప్రెస్ అయ్యారట.  ‘రాజా-రాణి’ ఫేమ్ అట్లీ ‘పోలీసోడు’(తమిళంలో ‘తెరి’) చిత్రంతో ప్రేక్షకులను పలకరించడడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన  అట్లీ ‘బ్రహ్మోత్సవం’ సెట్‌లోనే మహేశ్‌ను కలిసి, ఒక కథ వినిపించారట. ఆ కథ బాగా నచ్చేసి, స్క్రిప్ట్‌గా డెవలప్ చేసుకురమ్మని మహేశ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. మహేశ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు రొమాంటిక్, హై వోల్టేజ్ యాక్షన్  ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దే పనిలో అట్లీ ఉన్నట్టు భోగట్టా.

Advertisement
 
Advertisement
Advertisement