ఫస్టాఫ్‌ పసందుగా ఉందట | Mahesh Babu confirms doing a film with Sandeep Reddy Vanga | Sakshi
Sakshi News home page

ఫస్టాఫ్‌ పసందుగా ఉందట

Mar 3 2019 3:03 AM | Updated on Mar 3 2019 3:03 AM

Mahesh Babu confirms doing a film with Sandeep Reddy Vanga - Sakshi

‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో అన్ని ఇండస్ట్రీలను తనవైపు తిప్పుకునేలా చేశారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ప్రస్తుతం ‘అర్జున్‌ రెడ్డి’ని హిందీలో రీమేక్‌ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే సందీప్‌ నెక్ట్స్‌ చిత్రం మహేశ్‌బాబుతో అనే సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కదు, ప్రాజెక్ట్‌ సెట్‌ కాలేదనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. అయితేఆ వార్తలన్నీ అవాస్తవమని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని నెలల క్రితం మహేశ్‌బాబుకు స్టోరీ లైన్‌ వినిపించిన సందీప్‌ రెడ్డి లేటెస్ట్‌గా ఫస్ట్‌ హాఫ్‌ కథను పూర్తిగా వినిపించి, సెకండ్‌ హాఫ్‌ లైన్‌ చెప్పారట.

ఫస్టాఫ్‌ స్టోరీ మహేశ్‌కి బాగా నచ్చిందని సమాచారం. సెకండ్‌ హాఫ్‌ ఇంకా పూర్తిగా వినలేదని, మరోసారి మహేశ్‌ని కలిసినప్పుడు సందీప్‌ మిగతా సగం కూడా చెబుతారని తెలిసింది. హిందీ ‘అర్జున్‌ రెడ్డి’ పనులు పూర్తి కాగానే సందీప్‌.. మహేశ్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ అవుతారట. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు చేస్తున్న ‘మహర్షి’ ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఆ తర్వాత సుకుమార్‌ లేదా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ ఓ సినిమా చేయాలి. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత సందీప్‌ సినిమా ఉంటుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement