జయకు మహేష్‌ బాబు నివాళి

Mahesh Babu Condolence To Director B Jaya - Sakshi

హైదరాబాద్‌: నందమూరి హరికృష్ణ మరణవార్తను జీర్ణించుకోక ముందే టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. జర్నలిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, దర్శకత్వం వైపు అడుగులు వేసి చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న బి జయ గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు.  ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది.  బి జయ మరణవార్త తెలుసుకున్న మహేష్ బాబు.. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

జయ మరణం టాలీవుడ్ కు తీరని లోటని, జయలాంటి దర్శకురాలు టాలీవుడ్ కు అరుదుగా దొరుకుతుంటారని మహేష్ బాబు అన్నారు. బీఏ రాజు కుటుంబానికి మహేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేష్‌తో పాటు సీనియర్ హీరో వెంకటేష్, మంచు మనోజ్‌, ఆది, ఛార్మి, ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ పైడిపల్లి, గుణశేఖర్‌ తదితరులు ఆమెకు నివాళులు అర్పించారు. జయ ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు  తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. దీనిలో భాగంగా జయతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

టాలీవుడ్‌ దర్శకురాలు మృతి

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top